TG: తుపాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్
తున్నాయి. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని కొనిజర్ల మండలంలో గల అంజనాజపురం నిమ్మవాగు బ్రిడ్జిపై నుండి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. బ్రిడ్జిపై పొంగిపొర్లుతున్న నీటి ప్రవాహం నుంచి డ్రైవర్ డీసీఎం వ్యాను దాటించే ప్రయత్నం చేశాడు. బ్రిడ్జి మధ్యలోకి రాగానే వాహనం ఆగిపోవడంతో స్థానికులు డీసీఎంను వదిలి ఒడ్డుకు రావాలని చెప్పినా వినలేదు. దీంతో డీసీఎం కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ గల్లంతు అయ్యాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.