
భార్యకు ప్రేమ పెళ్లి చేసి.. భర్త ఆత్మహత్య
TG: ఖమ్మం జిల్లాలో సత్తుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల క్రితం ముస్లిం యువతితో వివాహం చేసుకున్న షేక్ గౌస్ (28) ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అతనికి ముగ్గురు కుమార్తెలు. ఇటీవల భార్య సత్యంపేట గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమలో పడగా, గౌస్ స్వయంగా వారిద్దరికీ హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించాడు. అనంతరం ఇంటికి చేరిన గౌస్ మనస్థాపంతో గురువారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి వెళ్లిపోవడం, తండ్రి మరణంతో ముగ్గురు బాలికలు బోరున విలపిస్తున్నారు.




