
విరిగిపడ్డ కొండచరియలు.. పరుగులు తీసిన జనం (వీడియో)
ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో శ్రీనగర్-బారాముల్లా జాతీయ రహదారిపై భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. అప్రమత్తమైన వాహనదారులు వెంటనే ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి నుంచి పరుగులు తీశారు. రోడ్డు విస్తరణ పనుల కారణంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంటోంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేదా గాయాలు సంభవించలేదు. ఈ ఘటనతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైవేపై వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.




