ఇండోనేషియా రాజధాని జకార్తా శివారులోని బెకాసి వద్ద రెండు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో 14 మంది మృతి చెందగా, 84 మంది గాయపడ్డారు. ఒక కమ్యూటర్ రైలు, లాంగ్ డిస్టాన్స్ రైలు ఢీకొన్న ఈ దుర్ఘటనలో రైలు బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, బాధితుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని అధికారులు తెలిపారు.