థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో టైగర్ కింగ్‌డమ్ పార్కులో కనైన్ డిస్టెంపర్ అనే వైరస్ కారణంగా 72 పులులు మృతి చెందాయి. ఫిబ్రవరి మొదటి వారం నుంచి పులులు అనారోగ్యానికి గురవుతుండగా నమూనాలు పరీక్షించిన అధికారులు సీడీవీ వైరస్ ఉన్నట్లు నిర్ధారించారు. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ కూడా తోడవడంతో మరణాలు పెరిగినట్లు తెలిపారు. అధికారులు పార్కును తాత్కాలికంగా మూసివేసి మిగతా పులులను క్వారంటైన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు.