ప్రేయసిని కడతేర్చిన 3 నెలలకే వెంటాడిన మృత్యువు

16చూసినవారు
ప్రేయసిని కడతేర్చిన 3 నెలలకే వెంటాడిన మృత్యువు
ప్రియురాలిని హత్య చేసిన మూడు నెలలకే ఓ వ్యక్తిని మృత్యువు వెంటాడింది. హత్య కేసులో జైల్లో శిక్ష అనుభవిస్తున్న నిందితుడు తాజాగా గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన గుజరాత్‌లోని సౌరాష్ట్రలో జరిగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన నరేంద్ర సింగ్ ధ్రువేల్ అనే వ్యక్తి సౌరాష్ట్రలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేసే వాడు. ఈ క్రమంలో పరిచయమైన యువతితో ప్రేమలో పడ్డాడు. అయితే వీరి ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. 3 నెలల క్రితం జరిగిన గొడవలో నరేంద్ర తన ప్రేయసిని కొట్టి చంపడంతో.. పోలీసులు నరేంద్రను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్