TG: ఆదిలాబాద్ రిమ్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు మరణించడం
బాధాకరమని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సూచించారు. మరోవైపు, BRS నేత కేటీఆర్ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, చిన్నారులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.