దిగజారిన టమాటా, ఉల్లి ధర.. రైతుల గగ్గోలు

16659చూసినవారు
దిగజారిన టమాటా, ఉల్లి ధర.. రైతుల గగ్గోలు
AP: టమోటా కిలో రూపాయి, ఉల్లి కిలో 30 పైసలకు పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి, టమోటా ధరలు రూ.25 నుంచి రూ.30 పలుకుతోందని వాపోతున్నారు. స్వేదం చిందించి కష్టపడిన రైతు నష్టపోతుంటే దళారులు, వ్యాపారులు లాభాలు ఆర్జిస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలం వచ్చినప్పుడల్లా టమోటా, ఉల్లి పంటల ధరలు పతనమవుతున్నాయని, ప్రభుత్వం జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్