TG: డీఎల్‌ఈడీ కోర్సులోని సీట్ల భర్తీకి నిర్వహించే డీఈఈసెట్ మూడో విడత కౌన్సెలింగ్ ఈ నెల 29 నుంచి ప్రారంభమవుతుందని కన్వీనర్ జీ రమేశ్ తెలిపారు. 29న సర్టిఫికెట్ వెరిఫికేషన్, 30న వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంది. జూలై 4న సీట్ల కేటాయింపు జరుగుతుంది. సీట్లు పొందినవారు జూలై 4 నుంచి 6 వరకు ట్యూషన్ ఫీజు చెల్లించి, కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. జూలై 8, 9 తేదీల్లో ైస్లెడింగ్, సీట్ల కన్వర్షన్ చేసుకోవచ్చు, అదే తేదీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.