రెజ్లింగ్‌లో కాంస్యం గెలుచుకున్న దీపక్‌ పునియా

2చూసినవారు
పద్దెనిమిదో ఆసియా క్రీడల్లో పురుషుల 97కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో భారత రెజ్లర్ దీపక్ పునియా చారిత్రాత్మక కాంస్యం సాధించాడు. శనివారం జరిగిన పోరులో మంగోలియాకు చెందిన ఘన్‌కుయగ్ గన్‌బాతర్‌ను 2-1తో ఓడించి, 60 ఏళ్ల పతక నిరీక్షణకు తెరదించాడు. గత ఆసియాడ్‌లో 83 కిలోల కేటగిరీలో వెండి గెలిచిన దీపక్, ఈసారి కంచుతో భారత్ ఖాతాలో 83వ పతకాన్ని చేర్చాడు. 1966లో భిమ్ సింగ్ తర్వాత ఈ కేటగిరీలో పతకం సాధించిన రెజ్లర్‌గా దీపక్ నిలిచాడు.

సంబంధిత పోస్ట్