
భార్యాభర్తల హత్యలకు దారితీస్తున్న నార్సిస్టిక్ ధోరణి
సమాజంలో పెరుగుతున్న హత్యోదంతాలు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఘర్షణలు హత్యలకు దారితీయడం ఆందోళన కలిగిస్తోంది. సోషల్ మీడియా వ్యసనం, నార్సిస్టిక్ ధోరణులు, ఐడెంటిటీ క్రైసిస్ వంటివి దాంపత్య జీవితాల్లో అగాధాన్ని సృష్టిస్తున్నాయి. సుఖ సంతోషాలకే ప్రాధాన్యతనిస్తూ, కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని, సొంతవారిని దూరం చేసుకుంటున్నారని మానసిక వైద్య నిపుణులు వివరిస్తున్నారు. వివాహేతర సంబంధాలు, ‘రెడ్‌ఫ్లాగ్స్’ ధోరణి, పెళ్లిని కాంట్రాక్ట్‌గా భావించడం వంటివి ఈ సమస్యలకు కారణమవుతున్నాయంటున్నారు.




