వర్కింగ్‌ అవర్స్‌పై స్పందించిన దీపిక

12898చూసినవారు
వర్కింగ్‌ అవర్స్‌పై స్పందించిన దీపిక
బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె తాజాగా తన వర్కింగ్‌ అవర్స్‌పై ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది సూపర్‌స్టార్‌లు, అగ్ర హీరోలు 8 గంటలు మాత్రమే పనిచేస్తారు. సోమవారం నుంచి శుక్రవారం వరకే షూటింగ్‌ చేస్తారు. వారాంతాల్లో పని చేయరు. ఇదేం రహస్యం కాదు. కానీ, ఇన్నేళ్లలో ఈ విషయం ఎప్పుడూ వార్తల్లో నిలవలేదు. ఇప్పుడు వాళ్ల పేర్లు చెబితే మొత్తం విషయం తప్పుదోవ పడుతుంది. అందుకే వాళ్ల పేర్లు చెప్పను" అని అన్నారు.

సంబంధిత పోస్ట్