AP: రాష్ట్రంలో ఘోరం చోటు చేసుకుంది. విశాఖ ఎంవీపీ కాలనీలో డిగ్రీ విద్యార్థి సాయితేజ ఆత్మహత్య చేసుకున్నాడు. సమతా కాలేజీలో సాయితేజ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మహిళా లెక్చరర్ లైంగిక వేధింపుల వల్లే సాయితేజ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు సమతా కాలేజీ వద్ద సాయితేజ స్నేహితులు, సహచరులు ఆందోళనకు దిగారు. సాయితేజ మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.