ధాన్యం కొనుగోలులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపించారు. నల్గొండ జిల్లా అర్జలబావి కొనుగోలు కేంద్రంలో 45 రోజుల క్రితం మహిళ ధాన్యం తీసుకొచ్చినా, అధికారులు ఇంకా కొనలేదని, సన్న బియ్యంపై మార్గదర్శకాలు రాలేదని చెబుతున్నారని ఆయన తెలిపారు. దళారులు, మిల్లర్ల నుంచి కమీషన్లు తీసుకుని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, 2014కు ముందున్న దుస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆయన విమర్శించారు.