కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ బ్యాలెన్స్‌పై వడ్డీని అందిస్తోంది. గత ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.25 శాతంగా నిర్ణయించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిఫార్సు చేసిన ఈ వడ్డీని మార్చి 2న కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ ప్రకటించింది. అయితే, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నెలలైనా ఇంకా వడ్డీ ఖాతాల్లో జమ కాలేదు. పీఎఫ్ వడ్డీ ఆలస్యంగా జమ అయితే నష్టపోతామని చాలామంది ఉద్యోగులు భావిస్తున్నప్పటికీ, జాప్యం వల్ల ఎలాంటి నష్టం జరగదని, నెలవారీ బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీని లెక్కించి, ఆర్థిక సంవత్సరం చివరిలో జమ చేస్తారని నిపుణులు చెబుతున్నారు.