TG: పోలీస్ లాకప్ డెత్‌లో మరణించిన కర్ల రాజేశ్ మృతిపై విచారణలో జాప్యం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, డీఎస్పీ జి.రవిని కలిసిన ఆయన, విచారణ అధికారిగా బాధ్యతలు చేపట్టి రెండు నెలలు అయినా పురోగతి లేదని, రీ పోస్టుమార్టం రిపోర్టు ఎప్పుడు వస్తుందో తెలియదని అన్నారు. అధికారులు కేసు విచారణ వేగంగా పూర్తి చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఆదివారం వరకు విచారణ పూర్తి చేస్తామని ఎస్పీ తెలిపారని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.