ఢిల్లీలో ప్రధాని
మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఢిల్లీలో కారు పేలుడు ఘటనను కేబినెట్ తీవ్రంగా ఖండించింది. ఈ పేలుడు ఘటన ఉగ్రవాదుల చర్యే అని కేబినెట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై పోరును కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీ ఘటనలో మృతులకు సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు.