ఢిల్లీ పేలుడు ఘటనలో మరో సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. ఈ పేలుడు దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. ఘటనా స్థలిలో హాహాకారాలు, ఆర్తనాదాలు, మృతదేహాలకు సంబంధించిన దృశ్యాలు కలచివేస్తున్నాయి. పేలుడు కోసం రెండు కిలోల అమ్మోనియం నైట్రేట్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. కారు మధ్యలో అమ్మోనియం నైట్రేట్ బాంబులు పెట్టారు. ఇప్పటివరకు పేలుడుకి సంబంధించి ఫోరెన్సిక్ సిబ్బంది 50 శాంపిళ్లను సేకరించింది.