దిల్లీ పేలుడు ఘటన.. 1000 అడుగుల దూరంలో తెగిపడిన చేయి

106చూసినవారు
దిల్లీ పేలుడు ఘటన.. 1000 అడుగుల దూరంలో తెగిపడిన చేయి
ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటన భయానక దృశ్యాలను మిగిల్చింది. పేలుడు తీవ్రతతో మృతదేహాలు ఛిద్రమై వందల మీటర్ల దూరంలో పడ్డాయి. తాజాగా ఘటనాస్థలం నుంచి సుమారు 1000 అడుగుల దూరంలో లజపతిరాయ్ మార్కెట్‌లోని ఓ దుకాణం పైకప్పుపై తెగిపడిన చేయిని గుర్తించారు. ఫోరెన్సిక్ అధికారులు ఆ అవశేషాలను స్వాధీనం చేసుకుని డీఎన్‌ఏ పరీక్షలకు పంపారు. ఈ ఘటనలో హైగ్రేడ్ పేలుడు పదార్థాలు ఉపయోగించినట్లు నిపుణులు నిర్ధారించారు.