ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో లక్నోకు చెందిన మహిళా ఉగ్రవాది డాక్టర్ షాహీన్ షాహిద్ అరెస్టుతో కొత్త వివరాలు వెలుగులోకి వచ్చాయి. మరో మహిళా ఉగ్రవాది అఫిరా బీబీ పేరు బయటకు వచ్చింది. ఈ దాడికి జైష్-ఎ-మొహమ్మద్‌కి సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది. పేలుళ్లకు వారం ముందు ఈ గ్రూప్‌లో అఫిరా బీబీని చేర్చినట్లు సమాచారం. ఆమె 2019 పుల్వామా దాడి నిందితుల్లో ఒకరైన ఉమర్ ఫరూఖ్ భార్యగా అధికారులు గుర్తించారు.