ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తుర్క్‌మాన్ గేట్ మసీదు వద్ద నిందితుడు ఉమర్ కనిపించిన ఫోటోలు, వీడియోలను పోలీసులు విడుదల చేశారు. పేలుడు జరిగిన రోజే ఆ ప్రాంతంలో ఉమర్ కదలికలు నమోదైనట్లు వెల్లడించారు. ఈ ఆధారాలను సేకరించిన అధికారులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.