
మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరల పెంపు?
ఈ ఏడాది మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.5, డొమెస్టిక్ సిలిండర్లపై రూ.50 పెంచాలని ఆయిల్ కంపెనీలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలు రోజుకు రూ.1,600 కోట్లు నష్టపోతున్నాయని అంచనా. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ధరల పెంపు ఖాయమనే ప్రచారం జోరందుకుంది. లీటరు పెట్రోల్‌పై రూ.18, డీజిల్‌పై రూ.35 చొప్పున నష్టాలను భరిస్తున్నాయని OMC వర్గాలు తెలిపాయి.




