
గుడి బావిలో బయటపడిన పురాతన విగ్రహాలు
AP: పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలోని పురాతన శ్రీ భావనారాయణ స్వామి దేవాలయంలో ఏడు లోహపు విగ్రహాలు బయటపడ్డాయి. ఆలయ పునర్నిర్మాణం కోసం మంగళవారం రాత్రి విగ్రహాలు తొలగిస్తుండగా, దేవాలయం లోపల బావిలో ఈ విగ్రహాలు కనిపించాయి. దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో వీటిని వెలికితీశారు. ఇవి విలువైన పంచలోహ విగ్రహాలు అయి ఉండవచ్చని, పూర్వం దొంగల బెడద నుంచి కాపాడటానికి వీటిని బావిలో దాచి ఉండవచ్చని భావిస్తున్నారు.




