IPL-2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేధికాగా CSKతో జరుగుతున్న మ్యాచులో DC బ్యాటర్లు తడబడ్డారు. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేసింది. చివర్లో స్టబ్స్ (38), సమీర్ రిజ్వీ (40) నిలకడగా ఆడటంతో ఈ మాత్రం గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. KL రాహుల్ 12, నిస్సాంక 19, నితీష్ 15, కరుణ్ నాయర్ 13 పరుగులు చేశారు. CSK బౌలర్లలో నూర్ అహ్మద్ 2, ముఖేష్, హోసేన్, ఓవర్టన్, గుర్జప్నీత్ తలో వికెట్ తీశారు. CSK టార్గెట్ 156 రన్స్.