ఢిల్లీ అగ్నిప్ర‌మాదం.. ప్రాణాల కోసం భవనం పైనుంచి దూకేసిన మహిళలు

40చూసినవారు
ఢిల్లీలోని హౌజ్ రాణి ప్రాంతంలో 'ఫ్లోరిష్ స్టే' అనే హోటల్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది వైద్య చికిత్సల కోసం భారత్‌కు వచ్చిన విదేశీయులే. ఐదంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లోని రెస్టారెంట్‌లో మంటలు చెలరేగి పై అంతస్తులకు వ్యాపించడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రాణాలు కాపాడుకోవడానికి కొందరు మహిళలు పై అంతస్తుల నుంచి దూకితే, స్థానికులు పరుపులు పరిచి వారిని కాపాడారు. ఇరుకైన సందుల్లో భవనం ఉండటం సహాయక చర్యలకు ఆటంకం కలిగించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్