
దేశంలోనే తొలిసారి.. TGSRTCలో AI వాడకం
TG: దేశంలోనే తొలిసారిగా ప్రజారవాణా సంస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని ప్రారంభించింది తెలంగాణ రాష్ట్ర రోడ్ల రవాణా సంస్థ (TGSRTC). హన్స ఈక్విటీ పార్ట్నర్స్ సహకారంతో అమలు చేయనున్న ఈ వ్యవస్థ ద్వారా సిబ్బంది పనితీరు, ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షణ, ఖర్చుల తగ్గింపు, రద్దీకి అనుగుణంగా సర్వీసుల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టనుంది. సేవలను మరింత ప్రజానుకూలంగా మార్చడం, ప్రయాణికుల సౌలభ్యం పెంచడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం అని అధికారులు తెలిపారు.




