లైంగిక వేధింపుల కేసులో దిగువ కోర్టు నిర్దోషిగా ప్రకటించిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్
ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నలుగురు మహిళా రెజ్లర్లు దిగువ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన కోర్టు, బ్రిజ్‌భూషణ్‌తో పాటు డబ్ల్యూఎఫ్ఐ మాజీ కార్యదర్శి వినోద్ తోమర్‌కు కూడా నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ అక్టోబర్ 9న జరగనుంది.