సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

20చూసినవారు
సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. 'సరిగమ' సంస్థ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. సరిగమ సంస్థ ఆరోపణల ప్రకారం, ఇళయరాజా తమ కాపీరైట్ పాటలను వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగిస్తూ, కోర్టు స్టే ఉత్తర్వులను అతిక్రమిస్తున్నారని, దీనిపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని, ఆయన ఆస్తులను జప్తు చేసి, విక్రయ సొమ్మును తమకు చెల్లించాలని పిటిషన్‌లో కోరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్