దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. రోజురోజుకు వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. పీల్చే గాలిలో నాణ్యత తీవ్రంగా క్షీణించడంతో ప్రజలు శ్వాసకోశ సమస్యలకు గురవుతున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 400 దాటడంతో ఢిల్లీ “డేంజర్ జోన్”లో కొనసాగుతోంది. పాఠశాలలు మూసివేయడం, వాహనాలపై పరిమితులు వంటి చర్యలు చేపట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.