
డిజిటల్ అరెస్ట్ స్కామ్.. రూ.32 కోట్లు నష్టపోయిన మహిళ
బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ (57) సైబర్ నేరగాళ్ల బారిన పడి దాదాపు రూ.32 కోట్లు నష్టపోయింది. గతేడాది సెప్టెంబర్లో ఆమె పేరుతో వచ్చిన పార్సిల్లో నిషేధిత పదార్థాలున్నాయని, ఇది సైబర్ నేరమని సైబర్ నేరగాళ్లు బెదింరించారు. నిందితులు ఆమెను నమ్మించి, భయపెట్టి మొత్తం 187 ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల ద్వారా రూ.31.83 కోట్లను బదిలీ చేయించుకున్నారు. 2025 ఫిబ్రవరిలో డబ్బు తిరిగిస్తామని నమ్మించారు. తర్వాత నిందితులు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.




