Top 10 viral news 🔥

చనిపోతా అనుకున్నాం.. ప్రాణాలతో బయటపడ్డాం
AP: పలాసలోని కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడిన నర్సిపురం అప్పారావు, లక్ష్మీ దంపతులను చికిత్స కోసం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులను ఒక్కసారిగా విడిచిపెట్టడంతో తోపులాట జరిగిందని తెలిపారు. “మేము తొక్కిసలాటలో ఇరుక్కుపోయాం. ఊపిరాడక చనిపోతాం అనుకున్నాం. అతి కష్టం మీద ప్రాణాలతో బయటపడ్డాం” అని బాధితులు తెలిపారు.




