TG: మెదక్ జిల్లా జహీరాబాద్ పట్టణంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న నందిని అనే మహిళను 108 సిబ్బంది ఆసుపత్రికి తరలిస్తుండగా, అంబులెన్స్‌లోనే ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇది ఆమె మూడవ కాన్పు. ఈఎంటీ సాయి కుమార్, పైలట్ దయానాలు ఈ ప్రసవంలో సహాయపడ్డారు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు. కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.