ఇన్‌స్టామార్ట్ ద్వారా గ్యాస్ సిలిండర్ల డెలివరీ.. స్విగ్గీ, హెచ్‌పీసీఎల్‌ ఒప్పందం

12చూసినవారు
ఇన్‌స్టామార్ట్ ద్వారా గ్యాస్ సిలిండర్ల డెలివరీ.. స్విగ్గీ, హెచ్‌పీసీఎల్‌ ఒప్పందం
స్విగ్గీ తన ఇన్‌స్టామార్ట్ విభాగం ద్వారా వంటగ్యాస్ సిలిండర్లను సరఫరా చేయనుంది. దీని కోసం హెచ్‌పీసీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. హెచ్‌పీసీఎల్‌ కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన 10 కిలోల 'హెచ్‌పీ నవ్య' ఎల్‌పీజీ సిలిండర్లతో పాటు 5 కిలోల సిలిండర్లను కూడా అందిస్తారు. ప్రస్తుతం ఈ సేవలు బెంగళూరులో అందుబాటులో ఉంటాయి. గృహ వినియోగ కనెక్షన్ లేనివారు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. విద్యార్థులు, బ్యాచిలర్ ఉద్యోగులకు ఇది ఎంతో ఉపయోగకరం.

సంబంధిత పోస్ట్