TG: హిందూ దేవతలను కించపరిచేలా మాట్లాడిన అన్వేష్‌పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని, కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ మేరకు అన్వేష్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినవారిలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎనుగంటి రాజు నేత, హైకోర్టు అడ్వకేట్ రాము, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు.