
హిమాచల్‌ప్రదేశ్ సీఎంకు ఆత్మాహుతి బాంబు దాడి బెదిరింపు
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖుకు బెదిరింపు వచ్చింది. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేయడానికి సీఎం వస్తే ఆయనను "ఆత్మాహుతి బాంబు దాడి" చేస్తామని సిమ్లా డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి మెయిల్ అందింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




