
AUS vs IND: స్టేడియం పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం!
భారత్–ఆస్ట్రేలియా ఐదో టీ20 మ్యాచ్లో వాతావరణం ఆటంకంగా మారింది. గబ్బా స్టేడియం పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉరుములు, మెరుపులు నమోదవుతున్నాయి. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రేక్షకులను అప్రమత్తం చేయాలని అధికారులు సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని స్టేడియం స్క్రీన్ల ద్వారా సూచనలు అందించారు. ఈ పరిస్థితుల కారణంగా మ్యాచ్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు.




