TG: హైదరాబాద్ రాజెంద్రనగర్‌లోని ఉప్పర్‌పల్లిలో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు కీలక ప్రసంగం చేశారు. యువతలో పెరుగుతున్న డిప్రెషన్, చిన్న సమస్యలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలకు చిన్ననాటి నుంచే రామాయణం, భాగవతం వంటి పురాణాలను బోధించాలని సూచించారు. వీటి ద్వారా పిల్లలకు మానసిక దృఢత్వం, జీవితంపై సరైన అవగాహన పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.