బేతుపల్లి చెరువు ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి ఆరా

20చూసినవారు
బేతుపల్లి చెరువు ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి ఆరా
TG: ఖమ్మం జిల్లా బేతుపల్లి చెరువులో గల్లంతైన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరా తీశారు. ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిందిగా సీఎస్‌కు సూచించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కలెక్టర్‌ను భట్టి ఆదేశించారు.

సంబంధిత పోస్ట్