
రామ్ పోతినేని అభిమానితో వీడియో కాల్.. వైద్య సహాయానికి హామీ
AP: తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 18 ఏళ్ల శశి భవ్యత అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైంది. అయితే హీరో రామ్ పోతినేని అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఈ నేపథ్యంలో ఆమెతో హీరో రామ్ పోతినేని వీడియో కాల్లో మాట్లాడి, మెరుగైన వైద్యం కోసం సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆ కుటుంబంలో ఆనందంతో పాటు, భవ్యత భవిష్యత్తుపై ఆశలు చిగురిస్తున్నాయి. వైద్యుల సూచన మేరకు ముంబై, బెంగళూరులోని ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తే ప్రయోజనం ఉండొచ్చని కుటుంబ సభ్యులు తెలిపారు.




