TG: రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, అప్పుల భారం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను ఆపకుండా కొనసాగిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జనగామ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రతికూల ఆర్థిక పరిస్థితుల్లోనూ ఇచ్చిన ప్రతి హామీని పేదల గుమ్మం వరకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కొత్త కార్యక్రమాలతో పాటు గతంలో ప్రారంభించిన సంక్షేమ పథకాలను కూడా నిరంతరాయంగా అందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తామని ఆయన పేర్కొన్నారు.