వరంగల్ విమానాశ్రయ అభివృద్ధికి భూమి అప్పగిస్తేనే సాధ్యం: కేంద్రం

0చూసినవారు
వరంగల్ విమానాశ్రయ అభివృద్ధికి భూమి అప్పగిస్తేనే సాధ్యం: కేంద్రం
తెలంగాణ ప్రభుత్వం భూమిని అప్పగిస్తేనే వరంగల్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు సాధ్యం కాదని, ప్రతిపాదిత స్థలాలు నిర్మాణానికి అనుకూలంగా లేవని పేర్కొంది. వరంగల్ విమానాశ్రయం అభివృద్ధికి 253 ఎకరాల స్థలం అవసరమని, రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థలాన్ని అప్పగించడంపైనే అభివృద్ధి ఆధారపడి ఉందని స్పష్టం చేసింది. తెలంగాణ సర్కార్ ప్రతిపాదించిన స్థలాలు విమానాశ్రయాల నిర్మాణానికి అనుకూలంగా లేవని తెలిపింది.

సంబంధిత పోస్ట్