మోపిదేవి ఆలయంలో భక్తురాలు అనుమానాస్పద మృతి

4చూసినవారు
మోపిదేవి ఆలయంలో భక్తురాలు అనుమానాస్పద మృతి
AP: కృష్ణా జిల్లాలోని మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఏలూరు జిల్లా కైకలూరు మండలానికి చెందిన మానుపాటి శ్రీదేవి అనే భక్తురాలు మృతి చెందింది. రాత్రి ఆలయానికి వచ్చి, ప్రాంగణంలోనే నిద్రపోయిన ఆమె తెల్లవారుజామున స్పందించకపోవడంతో మృతి చెందినట్లు తోటి భక్తులు గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక తర్వాతే మృతికి గల కారణాలు స్పష్టమవుతాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్