AP: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం దర్శనం కోసం నిలబడ్డ క్యూలైన్‌లో భక్తుల మధ్య తోపులాట జరిగింది. క్యూ లైన్‌లోనే భక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వాతావరణం ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి గొడవ సద్దుమణిగేలా చేశారు.