తిరుమలలో భక్తజనసంద్రం.. 15 గంటల్లో సర్వదర్శనం

6878చూసినవారు
తిరుమలలో భక్తజనసంద్రం.. 15 గంటల్లో సర్వదర్శనం
AP: తిరుమల గిరులుశనివారం భక్తజన నినాదాలతో మారుమోగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండిపోయి, శిలాతోరణం వరకు క్యూలైన్లు ఏర్పడ్డాయి. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. శుక్రవారం నాడు 66,014 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 31,092 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 4.44 కోట్లు రాగా, 4.23 లక్షల లడ్డూలు, 2.25 లక్షల మందికి అన్నప్రసాదం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్