యూపీలోని ఆగ్రాలో ఒక ఇంట్లో ఉన్న ఫ్రిజ్‌లో మంచు శివలింగం దర్శనం ఇవ్వడంతో అక్కడ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ శివలింగం ఏకంగా అమర్‌నాథ్ గుహల్లోని శివలింగాన్ని పోలి ఉండటంతో స్థానికులు ఆ ఇంటి వద్దకు తరలివచ్చి పూజలు చేస్తున్నారు. అమర్‌నాథ్ గుహలోని లింగం కరిగిపోయిందని, ఇప్పుడు తమ ఫ్రిజ్‌లో శివుడు ప్రత్యక్షమయ్యాడని ఆ ఇంటి యజమాని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.