ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో కార్తీక మాసం సందర్భంగా అరుదైన ఘటన చోటుచేసుకుంది. పెరంపేట రోడ్డులోని బాట గంగానమ్మ ఆలయం సమీపంలో వేప చెట్టు వద్ద నాగుపాము ప్రత్యక్షమైంది. దీంతో భక్తులు నేరుగా పాముకే పూజలు చేశారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.