
3 అడుగుల ఎత్తు.. న్యాయ పోరాటం చేసి డాక్టర్ అయ్యాడు (వీడియో)
శరీర పరిమితులు మనుష్యుడి ప్రయాణాన్ని ఆపలేవని, సంకల్పం ముందు ఎలాంటి అడ్డంకులైనా చిన్నవేనని జీవితం ద్వారా నిరూపించాడు డాక్టర్ గణేశ్ బరయ్యా. కేవలం మూడు అడుగుల ఎత్తైనా, వైద్యుడు కావాలన్న తన కలను న్యాయపోరాటం ద్వారా సాకారం చేసుకున్న అరుదైన వ్యక్తిత్వం ఆయనది. అవమానాలు, నిరాకరణలు, అవకాశాల మూతపడినా… ఒక్క అడుగు కూడా వెనక్కు వేయకుండా, నేడు ప్రభుత్వ వైద్యుడిగా ప్రజలకు సేవలు అందిస్తూ వేలమందికి ప్రేరణగా నిలుస్తున్నాడు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం.




