ట్రాఫిక్ నియంత్రణపై పోలీసు అధికారులకు డీజీపీ దిశానిర్దేశం

6చూసినవారు
ట్రాఫిక్ నియంత్రణపై పోలీసు అధికారులకు డీజీపీ దిశానిర్దేశం
TG: సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ట్రాఫిక్ నియంత్రణపై పోలీసు అధికారులకు డీజీపీ సీవీ ఆనంద్ దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్లతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం ఢిల్లీ పర్యటన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో సీఎం కాన్వాయ్ వెళ్లే వరకు పోలీసులు భారీగా వాహనాలను నిలిపివేశారు. దీంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. ఈ విషయం తెలిసి తన పర్యటనల నేపథ్యంలో వాహనదారులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవలని డీజీపీని సీఎం రేవంత్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్