
హృతిక్ రోషన్: బాలీవుడ్ అత్యంత ధనవంతుడైన స్టార్ కిడ్
నటుడు, నిర్మాత రాకేష్ రోషన్ కుమారుడు హృతిక్ రోషన్ GQ ఇండియా నివేదిక ప్రకారం రూ.3130 కోట్ల నికర విలువతో బాలీవుడ్లో అత్యంత ధనవంతుడైన రిచెస్ట్ స్టార్ కిడ్‌గా నిలిచాడు. 2000లో 'కహో నా... ప్యార్ హై' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసి ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. హృతిక్ తన నటనతో పాటు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నాడు. అయినప్పటికీ బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ (రూ.12,490 కోట్లు) అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నాడు.




