కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో కలిసి నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో బలమైన టాక్ వినిపిస్తోంది. యూవీ క్రియేషన్స్ ఈ ప్రతిష్టాత్మక మల్టీస్టారర్‌ను నిర్మించనుంది. ధనుష్ ఇటీవల నాగార్జునతో కలిసి నటించిన "కుబేర" సినిమా ప్రశంసలు అందుకుంది. మోహన్‌లాల్ ఇటీవల 2023 సంవత్సరానికి గానూ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఈ ఇద్దరు కలిసి నటిస్తే బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడం ఖాయమని అభిమానులు అంటున్నారు.